భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఆదివారం శ్రీ త్రిదండి దేవనాధ రామానుజ జీయర్ స్వామి వారు సందర్శించారు. ఆలయానికి చేరుకున్న స్వామి వారికి అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న జీయర్ స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు.