ఖమ్మంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి బెంచ్ ప్రెస్ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాస్టర్ టీం ఛాంపియన్షిప్ను మంగళవారం కైవసం చేసుకుంది. 72 ఏళ్ల డీవీ శంకర్రావు గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకుని కూడా వైద్యుల పర్యవేక్షణలో పోటీల్లో పాల్గొన్నారు. మాస్టర్ 4 విభాగంలో 83 కేటగిరీలో 60 కేజీల బరువెత్తి బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా ఆయనను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు అభినందించారు.