భద్రాచలం: రామయ్యకు భారీగా హుండీ ఆదాయం

రామయ్య సన్నిధిలో హుండీల లెక్కింపులో రూ. 2,31,31,984 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్, జనవరి నెలల్లో సెలవులు, ముక్కోటి ఏకాదశి ఉత్సవాల కారణంగా భక్తుల రద్దీ పెరిగిందని, దీనితో 70 రోజులకు గాను ఈ భారీ ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ఈఓ దామోదర్రావు సమక్షంలో జరిగింది. దీంతో పాటు 56 గ్రాముల బంగారం, 1,400 గ్రాముల వెండి కూడా భక్తుల కానుకల రూపంలో లభించినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్