భద్రాచల రామయ్య సన్నిధిలో రాములోరి నిత్య కళ్యాణం అర్చకులు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున మూలవరులకు అభిషేకాలు నిర్వహించిన అనంతరం, ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించి శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు.