భద్రాచలం: ఘనంగా రామయ్య నిత్య కళ్యాణం

గురువారం భద్రాచల రామయ్య సన్నిధిలో రాములోరి నిత్య కళ్యాణోత్సవం అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు జరిగాయి. నిత్యకల్యాణ వేదిక వద్దకు రాముడిని తీసుకువచ్చి, భక్తుల సమక్షంలో అభిషేకం, ఆ తర్వాత శాస్త్రోక్తంగా నిత్య కళ్యాణం నిర్వహించారు. విశ్వక్సేనార్చన, పుణ్యావాచనం, కంకణధారణ వంటివి జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్