భద్రాచలం: నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం రామయ్య నిత్యకల్యాణ వేడుక మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిగాయి. అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్