భద్రాచలం రామయ్య ఉప ఆలయం అయిన రంగనాయకస్వామి వారికి మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం వార్షిక కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ దామోదర్రావు కల్యాణ తలంబ్రాలను శిరస్సుపై పెట్టుకుని ప్రదక్షిణగా బయలుదేరగా, వైదిక పెద్దలు ఊరేగింపుగా రంగనాయకుల గుట్టకు చేరుకున్నారు. అక్కడ స్వామిని అర్చకులు ఆరాధించి నామార్చన నిర్వహించారు. విష్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం చేసి మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక కమనీయంగా నిర్వహించారు.