భద్రాచలం: ప్రమాదానికి గురైన వాహనాన్ని పరిశీలించిన: ఆర్టీవో

మొండికుంటలో జరిగిన కేఎల్ఆర్ కళాశాల బస్సు ప్రమాదంపై భద్రాచలం ఆర్టీవో వెంకట పుల్లయ్య శుక్రవారం స్పందించారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని పరిశీలించిన ఆయన, బస్సుకు ఫిట్నెస్, పర్మిట్ వంటి అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని, డ్రైవర్ వద్ద చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉందని ధృవీకరించారు. ప్రమాదంపై పూర్తిస్థాయిలో సాంకేతిక దర్యాప్తు చేపడతామని ఆర్టీవో తెలిపారు.

సంబంధిత పోస్ట్