భద్రాచలం: రామయ్యకు సహస్ర కళాభిషేకం

భద్రాచల రామయ్య ఆలయంలో ఆదివారం అత్యంత వైభవంగా సహస్ర కలశాభిషేక తిరుమంజనం నిర్వహించారు. యాగశాల నుంచి పవిత్ర కలశాలను వేదమంత్రాల నడుమ తెచ్చి, ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం చేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఆలయ ఈవో దామోదర్ రావుతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్