రాజీవ్ యువ వికాస లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయనున్నట్లు భద్రాచలం మండల ప్రజా పరిషత్ అధికారి బొగ్గ నారాయణ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు యువ వికాసం ద్వారా లబ్ధి పొంది స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.