భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఇంటర్ తొలి సంవత్సరం సీట్లను భర్తీ చేయడానికి జులై 2న ప్రత్యేక స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి. రాహుల్ శనివారం తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు ఉదయం 9 గంటలకు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.