భద్రాచలం: రామయ్యకు వసంతోత్సవం

భద్రాచలం రామయ్య దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణం తర్వాత నూతన వధూవరులైన సీతారాములకు వసంతోత్సవం జరపడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం వసంతోత్సవాన్ని మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి వారి ఉత్సవమూర్తులను అంతరాలయం నుంచి బేడా మండపం లోని నిత్యకల్యాణ వేదికపై కొలువుదీర్చారు.

సంబంధిత పోస్ట్