భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు, సుదర్శన హోమం, ఇతర యాగశాల పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యా వాచనం, కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.