భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిధిలో రోడ్డు సమస్యపై టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాలకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే ఆ సీసీ రోడ్డును విస్తరించి, వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాళ్లూరి చిట్టిబాబు, శ్రీనివాస్, రాజారాం, దేశప్ప, చంటి, రాంబాబు, అశోక్, రాఘవ ఉన్నారు.