భద్రాచలం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిపై అభియోగాలు రుజువు కావడంతో మంగళవారం భద్రాచలం కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించింది. ఈ కేసులో న్యాయమూర్తి శివనాయక్ ఈ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీధర్ వాదనలు వినిపించగా, కోర్టు డ్యూటీ అధికారి నరసింహారావు సహకరించారు.