భద్రాచలం: రేపు ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన దర్బార్

జూన్ 16న భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని సూచించారు. సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10. 30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్