భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం నీటిమట్టం 33. 30 అడుగులకు చేరింది. గోదావరి వద్ద భక్తులు పవిత్ర స్నానం ఆచరించే స్నాన ఘట్టాలు సైతం మునిగిపోయాయి. కాగా 5, 45, 600 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల అవుతున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రానికి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు నదిలోకి దిగకుండా చర్యలు చేపడుతున్నారు.