భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో బుధవారం ఐటీడీఏ పీవో రాహుల్‌తో కలిసి డీఎంహెచ్‌వో తుకారామ్ రాథోడ్ లాక్టేషన్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను ప్రారంభించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించి, ఆరోగ్యకరమైన ఎదుగుదల, రోగనిరోధక శక్తి, సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని ఆయన అన్నారు. ప్రసవించిన తల్లులకు తల్లిపాలు ఇవ్వడంలో ఎదురయ్యే సమస్యలకు ఈ యూనిట్ ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు.