భద్రాచల దివ్యక్షేత్రంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త నవహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీసీతారామచంద్రస్వామి వారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వెన్నెల కాంతుల మధ్య స్వామివారి ఊరేగింపు మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు జయజయధ్వానాలతో స్వామివారికి నీరాజనాలు అర్పించారు.