చర్ల మండల కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని మావోయిస్టులు హత్య చేసిన ఘటన సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో జరిగింది. అరన్‌పూర్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా జోగా బోర్సే బరిలో ఉన్నారు. శుక్రవారం మావోయిస్టులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేశారని సమాచారం. దీంతో జోగా బర్సేను హత్య చేసినట్లు తెలుస్తోంది.