బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ అవినీతి, అక్రమ నియామకాలకు అడ్డాగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. పంచాయతీ పాలనలో పారదర్శకత లోపించిందని, నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా కాంట్రాక్టు సిబ్బందిని నియమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సుమారు 250 మంది పనిచేస్తున్న పంచాయతీలో, పారిశుద్ధ్య కార్మికులు మినహా కార్యాలయ విధులు నిర్వర్తిస్తున్న 28 మంది కాంట్రాక్టు సిబ్బంది నియామకంపై తీవ్ర చర్చ జరుగుతోంది.