భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలోని గిరిజన భవన్లో గోండి–కోయ నిఘంటువు వర్క్‌షాప్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి. రాహుల్ పాల్గొన్నారు. ప్రాచీన గోండి–కోయ భాష పదాలు, అక్షరాల మూలాలను గుర్తించి ప్రామాణికీకరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. భాష, సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పీవో రాహుల్ పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో తొమ్మిది రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. కోయ భాష–సంస్కృతికి గుర్తింపు కోరుతూ ఈ కార్యక్రమం జరిగింది.