వర్షంలోనూ డ్రైనేజీ పనులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం కేశవాపురం పంచాయతీలో వర్షానికి నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో సర్పంచ్ శారద వెంటనే స్పందించారు. జేసీబీ సాయంతో శుక్రవారం కాలువలు తీయించి నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టారు. వర్షం కురుస్తున్నప్పటికీ పనులు కొనసాగించడంతో నీటి సమస్యకు ఉపశమనం లభించిందని గ్రామస్థులు తెలిపారు. సమస్యపై వెంటనే స్పందించిన సర్పంచ్ శారద, ఉపసర్పంచ్ కునారపు సతీష్‌లకు వారు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕