దుమ్ముగూడెం మండలంలోని నారాయణరావుపేట గ్రామపంచాయతీ కార్యదర్శికి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో లోపాలు జరుగుతున్నాయని మండల కమిటీ సభ్యులు వీరభద్రం ఆరోపిస్తూ వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామసభ ఆమోదంతోనే అర్హులైన పేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలని, ఇందులో రాజకీయ జోక్యం ఉండకూడదని అధికారులను డిమాండ్ చేశారు.