దుమ్ముగూడెం: ఆకాంక్ష మేళా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామంలోని రైతు వేదిక వద్ద "ఆకాంక్ష మేళా" కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా "సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్"లో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రైతులకు అవగాహన కల్పించారు. పంటల నష్టం నివారించేందుకు రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా వ్యవసాయంలో ప్రగతి సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్