దుమ్ముగూడెం: ఇసుక లారీలపై చర్యలు తీసుకోవాలని నిరసన

దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. రోడ్లను ధ్వంసం చేస్తున్న ఇసుక లారీలను ఆపాలని అధికారులను కోరారు. అధ్వానంగా తయారైన రోడ్లను మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్