భద్రాచలంలో తొలి హ్యూమన్ మిల్క్ బ్యాంక్‌కు శ్రీకారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంక్‌ను ప్రారంభించనున్నారు. తల్లి లేదా శిశువు ఆరోగ్య కారణాల వల్ల వెంటనే పాలివ్వలేని పరిస్థితుల్లో, తల్లిపాలను సేకరించి, భద్రపరిచి, అవసరమైన శిశువులకు అందించడం ఈ బ్యాంక్ ముఖ్య ఉద్దేశ్యం. ముర్రుపాలను కూడా ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. దీనివల్ల నవజాత శిశువులకు సకాలంలో తల్లిపాలు అందే అవకాశం మెరుగుపడుతుంది.

సంబంధిత పోస్ట్