భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు.. 41.50 అడుగులకు నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ఆదివారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 41.50 అడుగులకు చేరింది. శనివారం రాత్రి 10 గంటలకు 33.70 అడుగులుగా ఉన్న నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ప్రవాహం 8,68,724 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో స్నానఘట్టాల వద్ద పలు మెట్లు నీటమునిగాయి. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు రెండో, 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕