ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని భద్రాచలం అడవుల్లో మావోయిస్టుల డంపులపై పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల అగ్రనేతలు లొంగిపోవడంతో వారు దాచిన ఆయుధాలు, నిధులు వెలుగులోకి వచ్చాయి. సీఎం రేవంత్‌ను కలిసిన మావోయిస్టు మాజీ నేతలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. చర్ల-కడేడోరా అటవీ ప్రాంతంలో జరిపిన గాలింపులో రూ.47 లక్షల నగదు, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.