గోదావరి నది ఔన్నత్యాన్ని చాటే 'నదీహారతి' నేడు భద్రాచలంలో

భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదిలో నేడు 'నదీహారతి' నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా గత శనివారం ప్రారంభమైన 'ఏరు-ది రివర్ ఫెస్టివల్' (నదీహారతి) ఇకపై ప్రతి శనివారం భద్రాచలంలో జరుగుతుంది. గోదావరి నది గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్