భద్రాచలంలో రామయ్య దర్శనం నిలిపివేత

చంద్రగ్రహణం కారణంగా మంగళవారం శ్రీరామచంద్రుని దర్శనానికి అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, ఆరాధన, సేవాకాలం, నివేదన వంటి కార్యక్రమాలు నిర్వహించి, ఉదయం 6:30 నుండి 7:30 వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు. అనంతరం మధ్యాహ్న ఆరాధన తర్వాత 8:30 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు తెరిచి, ఆలయ శుద్ధి, శాంతి హోమం నిర్వహించిన తర్వాత 8:30 గంటలకు దర్శనానికి అనుమతిస్తారని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్