భద్రాచల రామయ్య పుణ్యక్షేత్రంలో గురువారం నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, అభిషేకాలు అనంతరం, బేడ మండపంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరిపించారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.