యువకుడికి అరుదైన ప్లాస్టిక్ సర్జరీ విజయవంతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ ప్రమాదంలో 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ములుగు జిల్లా యువకుడు భాస్కర్‌కు వైద్య బృందం అరుదైన ప్లాస్టిక్ సర్జరీ మంగళవారం  విజయవంతంగా నిర్వహించింది. ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు సహా వైద్యుల బృందం చేసిన స్కిన్ గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్సతో భాస్కర్ కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ అరుదైన శస్త్రచికిత్స యువకుడికి పునర్జన్మను ప్రసాదించింది.

సంబంధిత పోస్ట్