భద్రాద్రి జిల్లా ములకలపల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు స్కూటీపై ఎక్కుతుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, సాయిబాబు మలుపు వద్ద ఆగి స్కూటీపై ఎక్కుతుండగా టిప్పర్ ఢీకొట్టింది.