గృహ విద్యుత్ వినియోగదారులకు సౌర విద్యుత్: సూర్య-సేతు కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం డివిజన్‌లో గృహ విద్యుత్ వినియోగదారులకు సౌర విద్యుత్, సబ్సిడీపై అవగాహన కల్పించేందుకు ‘సూర్య–సేతు’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అక్టోబర్ 1, 2 తేదీల్లో భద్రాచలం డివిజన్ కార్యాలయంలో, 3న మణుగూరు సబ్‌స్టేషన్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. 1 KWకు రూ. 30 వేలు, 2 KWకు రూ. 60 వేలు, 3 KWకు పైగా రూ. 78 వేల వరకు సబ్సిడీ లభిస్తుంది.

సంబంధిత పోస్ట్

✕
✕