భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సోమవారం జేష్ట పౌర్ణమి సందర్భంగా సీతారాములకు విశేష అభిషేకం నిర్వహించారు. అర్చకులు పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాన్ని తీసుకువచ్చి హోమశాలలో ప్రత్యేక పూజలు చేసి, 81 కళాశాల జలాలు, వివిధ నదీ జలాలు, పంచామృతాలు, పండ్ల రసాలతో స్వామివారికి స్నపనతిమంజనం నిర్వహించారు. వేద పండితుల వేదమంత్రాల నడుమ అర్చకులు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ప్రతి పౌర్ణమి రోజు ఇలాగే విశేష అభిషేకం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు.