భద్రాచలంలో రామాలయంలో వ్రతాలు

భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం తొలి శనివారం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చిన దంపతులు ఈ వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రామయ్యను దర్శించుకున్నారు. కార్తీక మాసంలో సత్య దేవుని వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో దామోదర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్