బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మురు గ్రామపంచాయతీలోని పల్లె ప్రకృతి వనం సమాధుల నిర్మాణంతో వివాదాస్పదంగా మారింది. కొందరు వ్యక్తులు వనంలో పాలరాయితో సమాధులు నిర్మిస్తున్నా, సర్పంచ్, సెక్రటరీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఈ నిర్మాణాలను ఆపాలని, ప్రకృతి వనాన్ని కాపాడాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాలకవర్గంపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.