అభివృద్ధికి అటవీ శాఖ సహకారం: DFO కృష్ణ గౌడ్

భద్రాచలం: చట్ట నిబంధనలు పాటిస్తూనే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని డీఎఫ్ఓ కృష్ణ గౌడ్ స్పష్టం చేశారు. ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 58 శాతం అటవీ ప్రాంతం ఉన్నందున వన్యప్రాణులు, అడవుల సంరక్షణకు చట్టపరమైన అనుమతులు తప్పనిసరని పేర్కొన్నారు. ప్రాధాన్యత క్రమంలో రహదారులు, విద్యుత్ లైన్ల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్