కొత్తగూడెం: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు ఏర్పాట్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మే 13 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈసీ కన్వీనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం జరిగిన సమీక్షలో పరీక్షల నిర్వహణపై చర్చించారు. ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం 6,684 మంది విద్యార్థులు హాజరుకానుండగా, వీరిలో ఫస్ట్ ఇయర్ కు 4,994 మంది, సెకండ్ ఇయర్ కు 2,190 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల కోసం 26 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్