భద్రాద్రి జిల్లా నిరుద్యోగులకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ శుభవార్త అందించారు. హైదరాబాదులోని ఒక ప్రైవేటు కంపెనీలో 50 కేర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, 8వ తరగతి ఆపై చదివిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. జీతం రూ.16,500 నుండి రూ.22 వేల వరకు ఉంటుందని, 18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు గలవారు ఈనెల 10న ఉదయం 10 గంటలకు చుంచుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.