భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం 18 ఏళ్ల యువతి ఇంట్లో బాత్రూమ్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతదేహంపై గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఐ శ్రీలక్ష్మీ, ఎస్సై జీనత్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.