భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచలోని రాజీవ్‌నగర్ చర్చి సమీపంలో గత కొన్ని రోజులుగా మరమ్మతులకు గురై పనిచేయని బోరును 33వ డివిజన్ కార్పొరేటర్ బాలు నాయక్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయించారు. మంగళవారం జరిగిన ఈ చర్యతో స్థానికులకు తాగునీటి సమస్య తీరింది. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని కార్పొరేటర్ బాలు నాయక్ తెలిపారు.