భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం (GVS) మరియు ఇతర గిరిజన, విద్యార్థి సంఘాలు ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించాయి. గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని వారు కోరారు.