కొత్తగూడెంలో ఆదివారం ఉదయం 11 గంటలకు లక్ష్మీదేవిపల్లి మండల సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, ఊకంటి గోపాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. పెద్దబాబు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, జిల్లా అధికార ప్రతినిధి వై. శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు దేవరగట్ల ప్రసాద్, మండలనాయకులు రెడ్డెం సతీష్, రామయ్య, ప్రసాద్ తదితరులు పరిశీలించారు. ఈ సభకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లా నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.