పాల్వంచలోని స్టార్ చిల్డ్రన్ హైస్కూల్‌లో 6-10 తరగతుల విద్యార్థులకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ముఖ్య అతిథి బ్రహ్మకుమారిస్ బి. కె. ప్రశాంతి మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు 'నో' చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ భాస్కరరావు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.