భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం, భద్రాచలంకు సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాల, రామాయణ కథతో ముడిపడిన ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. రాముడు, సీత, లక్ష్మణుడు వనవాస సమయంలో ఇక్కడ నివసించారని స్థలపురాణం చెబుతుంది. సీత స్నానమాడిన ప్రదేశం, సీతవాగు, వేడినీళ్ల గుంట, చన్నీళ్ల గుంట, రాముడి పాదముద్రలు, సూర్పనక కు ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడి రాళ్లగుట్ట వంటివి ఇక్కడ చూడవచ్చు. రామాయణంలోని ముఖ్య ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు, దృశ్యాలు పర్ణశాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.