చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ డంపింగ్ యార్డ్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సోమవారం సందర్శించారు. కోన్-టిక్ కొలిమి ద్వారా చెట్ల కొమ్మలతో తయారవుతున్న బయోచార్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. గోమూత్రం, పేడతో మేళవించి సేంద్రియ ఎరువుగా వాడితే భూసారం పెరిగి దిగుబడులు మెరుగవుతాయని అన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి సేకరించాలని సూచించారు.