భద్రాద్రి: మెగా ఆధార్ క్యాంప్‌తో 3,700కు పైగా సమస్యల పరిష్కారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన మెగా ఆధార్ క్యాంపుల ద్వారా 3,772 ఆధార్ సమస్యలు పరిష్కరించబడ్డాయి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. పదివేలకు పైగా ప్రజలు హాజరైన ఈ క్యాంపులో 489 కొత్త నమోదులు, 602 బయోమెట్రిక్ అప్‌డేట్‌లు వంటి సేవలు అందించబడ్డాయి. మండలాల వారీగా నిర్వహించే క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

సంబంధిత పోస్ట్