భద్రాద్రి: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఉద్యమించాలి

పారిశ్రామికవేత్తల ఆర్థిక ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్లు తెచ్చారని సీపీఎం జాతీయ నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజాసంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ విస్తృత సమావేశంలో మాట్లాడారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్నివర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. భారతదేశానికే ప్రమాదకరంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసే వరకు ఉద్యమించాలన్నారు.

సంబంధిత పోస్ట్